Inter board: ఇంటర్‌ బోర్డు లీలల్లో ఇదొకటి...17 మార్కులు వస్తే పాస్‌ చేసిన వైనం

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అవకతవకలు
  • 27 మార్కులు రాకుండానే పాస్‌

తెలంగాణ ఇంటర్‌ బోర్డు లీలలు బయటపడుతున్న కొద్దీ మతిపోతోంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడివున్న జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలకు, వేలాది మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడానికి కారణమయ్యిందన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ విషయంలో హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా, పాస్‌ అయినట్టు ప్రకటించినట్లు వెలుగు చూడడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌కు గణితం 1(ఎ)లో 17 మార్కులు మాత్రమే వచ్చాయి. వాస్తవంగా పాస్‌ మార్కులు 27. కానీ అతను పాస్‌ అయినట్టు బోర్డు ప్రకటించడం విశేషం.

More Telugu News