Guntur District: గుంటూరు స్ట్రాంగ్ రూమ్ వద్ద పనిచేయని సీసీ కెమెరాలు... టీడీపీ ఆందోళన!

  • నాగార్జున యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్
  • మంగళవారం రాత్రి ఆగిపోయిన ప్రత్యక్ష ప్రసారం
  • విషయం తెలుసుకుని సరిచేసిన సిబ్బంది
గుంటూరుకు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీ కెమెరాలు చాలాసేపు నిలిచిపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలను భద్రపరిచిన గదిలో ఉన్న కెమెరాల నుంచి అనుక్షణం ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తుండగా, నిన్న రాత్రి నుంచి పలు కెమెరాలు పనిచేయలేదు. విషయాన్ని గమనించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆందోళనతో తమ నేతలకు కబురు పంపారు. దీంతో పలువురు తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, సీసీ కెమెరాలను సరిచేసి, ప్రత్యక్ష ప్రసారాన్ని పునరుద్ధరించారు. కాగా, ఈ స్ట్రాంగ్ రూమ్ లో గుంటూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచినట్టు తెలుస్తోంది.
Guntur District
Nagarjuna University
Storng Room
ENMs
Telugudesam

More Telugu News