Nagarjuna: బిగ్ బాస్ -3 హోస్ట్ గా నాగార్జున!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను 'బిగ్ బాస్' ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్ లు సాగిన ఈ షో, ఇప్పుడు మూడో సీజన్ కు సిద్ధమవుతోంది. బిగ్‌ బాస్ -1లో ఎన్టీఆర్, బిగ్ బాస్ -2లో నాని హోస్ట్‌ గా మెప్పించగా, మూడో సీజన్ కోసం తొలుత ఎన్టీఆర్‌‌ నే అడిగారట. అయితే రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ఆర్ఆర్'లో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్ నిరాకరించారట. దీంతో ఆ చాన్స్ టాలీవుడ్ హీరో నాగార్జునకు దక్కగా, ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ అలరించిన ఆయన, బిగ్ బాస్ ను కూడా సక్సెస్ ఫుల్ గా నడుపుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Nagarjuna
Biggboss
Hoste

More Telugu News