India: ముగిసిన మూడో విడత పోలింగ్

  • 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్
  • పశ్చిమబెంగాల్, యూపీ రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు
  • ఓటేసిన ప్రముఖులు

దేశంలోని 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు పోలింగ్ ముగిసింది. లోక్ సభ ఎన్నికల్లో మూడో విడతగా ఇవాళ ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేకమంది ప్రముఖులు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లి వద్ద ఆశీస్సులు పొంది మోదీ ఓటేశారు. మోదీ ఓటేసేందుకు రాగా ఆయన వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా దర్శనమిచ్చారు. ఇక పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది.

ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 61.31 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 గంటల వరకు  నమోదైన ఓట్ల శాతం ఇలా ఉంది...

  • అసోం- 74.05
  • బీహార్-54.95
  • ఛత్తీస్ గఢ్-64.03
  • గోవా-70.96
  • గుజరాత్-58.51
  • జమ్మూకాశ్మీర్-12.46
  • కర్ణాటక-60.87
  • కేరళ-68.62
  • మహారాష్ట్ర-55.05
  • ఒడిశా-57.84
  • త్రిపుర-71.13
  • ఉత్తరప్రదేశ్-56.36
  • పశ్చిమ బెంగాల్-78.94
  • దాద్రానగర్ హవేలి-71.43
  • డామన్ డయ్యూ-65.34

  • Loading...

More Telugu News