hardik patel: నాకు చౌకీదార్ కావాలనుకుంటే నేపాల్ కు వెళ్తా: హార్దిక్ పటేల్

  • ఓటు వేసిన అనంతరం మాట్లాడిన హార్దిక్ 
  • నాకు కాపలాదారుడు అవసరం లేదు 
  • దేశాన్ని బలోపేతం చేసే ప్రధాని కావాలి
ప్రధాని మోదీపై పటిదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ సెటైర్లు వేశారు. తనకు చౌకీదార్ (కాపలాదారుడు) కావాలనుకుంటే నేపాల్ కు వెళ్లి అక్కడ వెతుక్కుంటానని ఆయన ఎద్దేవా చేశారు. తనకు చౌకీదార్ అవసరం లేదని... దేశ ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, యువత, జవాన్లను బలోపేతం చేసే ప్రధానమంత్రి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనను తాను దేశానికి కాపలాదారుడిగా అభివర్ణించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ పైమేరకు వ్యాఖ్యానించారు.
hardik patel
modi
chowkidar
congress
bjp

More Telugu News