goutam thinnanuri: ఎన్టీఆర్ కి కథ చెప్పిన 'జెర్సీ' దర్శకుడు?

  • 'జెర్సీ'తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి 
  • ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కసరత్తు
  •  చరణ్ ని కలిసేందుకు ప్రయత్నాలు    
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'జెర్సీ' సినిమాను గురించి .. దానిని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి టాలెంట్ గురించి ఇటు దిల్ రాజు .. అటు రాజమౌళి ప్రస్తావించడంతో, ఈ దర్శకుడిని వెతుక్కుంటూ చాలామంది నిర్మాతలు వస్తున్నారట.

ఇక గౌతమ్ మాత్రం తదుపరి సినిమాను పెద్ద హీరోలతో చేయాలనే ఉద్దేశంతో, వాళ్లను లైన్లో పెట్టే పనిలో వున్నాడని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన ఎన్టీఆర్ ను కలిసి ఒక కథ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో .. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి కలవమని ఎన్టీఆర్ అనడంతో, ప్రస్తుతం గౌతమ్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తరువాత చరణ్ ను కూడా లైన్లో పెట్టేద్దామనే ఆలోచనను ఆచరణలో పెట్టబోతున్నాడు. గౌతమ్ .. చరణ్ ను కలుసుకోవడానికి నిర్మాత ఎన్వీ ప్రసాద్ సిఫార్స్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. కథ ఓకే అయితే నిర్మాతగా ఎన్వీ ప్రసాద్ వ్యవహరిస్తారని అంటున్నారు.
goutam thinnanuri

More Telugu News