Telangana: ఎలాంటి రుసుం లేకుండా రీవాల్యుయేషన్ చేయాలి: టీడీపీ నేత రావుల డిమాండ్

  • ఇంటర్ ఫలితాలపై న్యాయ విచారణ జరపాలి
  • జగదీశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి
  • విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
ఇంటర్ ఫలితాలపై న్యాయ విచారణ జరపాలని ఈ ఘటనకు విద్యాశాఖా మంత్రి జగదీశ్ రెడ్డి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఎలాంటి రుసుం లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇది అప్రజాస్వామికం, అనైతికం అని విమర్శించారు. దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పాలని కేసీఆర్ చూస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
Telangana
minister
jagadish reddy
Telugudesam
ravula

More Telugu News