Telugudesam: మోదీ, జగన్ వల్లే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: యనమల

  • ఏపీకి రావాల్సిన నిధులను అడ్డుకున్నారు
  • ఉపాధి నిధులనూ అడ్డుకునే కుట్ర 
  • వైఎస్ హయాంలో అప్పులను టీడీపీ ప్రభుత్వమే చెల్లిస్తోంది
ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ వల్లే ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను మోదీ అడ్డుకున్నారని, కూలీలకు ఇచ్చే ఉపాధి నిధులు కూడా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో తిష్టవేసిన విజయసాయిరెడ్డి అపోహలు సృష్టించడమే కాకుండా వాటిని మరింత చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి నిధులు ఇవ్వకుండా ఆర్బీఐని అడ్డుకున్నారని, నాడు సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులను టీడీపీ ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ, ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని కేసీఆర్ కు అసూయ అని విమర్శించారు.
Telugudesam
bjp
YSRCP
Chandrababu
kcr
TRS
modi
vijayasai reddy
Telangana

More Telugu News