YSRCP: వైసీపీ విజయం సాధించబోతోందని చంద్రబాబుకు తెలుసు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • అందుకే, ఈవీఎంలు సరిగా లేవని చెబుతున్నారు
  • ఈవీఎంల పనితీరుపై అనుమానాలు సరికాదు
  • ఈసీపై నెపం వేసేందుకు బాబు యత్నిస్తున్నారు
వైసీపీ విజయం సాధించబోతోందని చంద్రబాబుకు తెలుసని, అందుకే, ఈవీఎంలు సరిగా లేవంటూ కారణాలు సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని, ఈవీఎంలలో పొరపాట్లు లేకుండా ఉండేందుకే ఈసీ వీవీ ప్యాట్లు తీసుకొచ్చిందని అన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చంద్రబాబు తీరు దారుణమని, ఈసీని తప్పుబట్టడం సరికాదని, ఈసీపై నెపం వేసేందుకు బాబు యత్నిస్తున్నారని ఆరోపించారు.
YSRCP
secretary
sajjala
Ramakrishna reddy

More Telugu News