Ramcharan: రామ్ చరణ్ పై అభిమానాన్ని చాటుకున్న జపాన్ ప్రజలు

  • మెగా తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు
  • భారత్ కు 50కి పైగా గ్రీటింగ్ కార్డులు
  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన రామ్ చరణ్
టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ కు తెలుగు రాష్ట్రాల్లోనేకాదు జపాన్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మగధీర చిత్రం జపాన్ లోనూ విశేషమైన ప్రజాదరణ పొందింది. పునర్జన్మ కాన్సెప్ట్ తో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చరణ్ నటన జపాన్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, అక్కడి అభిమానులు రామ్ చరణ్ బర్త్ డేను గుర్తుపెట్టుకుని దాదాపు 50కి పైగా గ్రీటింగ్ కార్డులు పంపారు.

'హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్' అంటూ ఉన్న ఆ గ్రీటింగ్ కార్డులను చూసి చెర్రీ ఆశ్చర్యపోయాడు. ఈ మెగాహీరో పుట్టినరోజు మార్చి 27న. ఈ సందర్భంగా జపాన్ నుంచి వచ్చిన కార్డులను రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. "మీ ప్రేమ, ఆప్యాయత ఎంతో ఆనందం కలిగించాయి, త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను" అంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు.
Ramcharan
Japan

More Telugu News