West Bengal: మూడో విడత పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో బాంబుదాడులు

  • ముర్షిదాబాద్‌ మున్సిపాలిటీ దోమకల్‌ ప్రాంతంలో ఘటన
  • ముగ్గురు తృణమూల్‌ కార్యకర్తలకు గాయాలు
  • పోలింగ్‌ బూత్‌ ఆక్రమణ యత్నం సందర్భంగా ఘటన
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌ మున్సిపాలిటీ దోమకల్‌ ప్రాంతంలోని ఓ పోలింగ్‌బూత్‌ వద్ద బాంబు దాడులు జరిగాయి. పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్న సందర్భంగా జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఈ దాడిలో ముగ్గురు తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు అలెర్టయి పరిస్థితిని చక్కదిద్దడంతో కాస్త ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. అసాంఘిక శక్తులను నిరోధించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై బహరల్‌ ప్రిసైడింగ్‌ అధికారిని ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది.
West Bengal
bomb rides
three injured

More Telugu News