Narendra Modi: మోదీ వారసత్వాన్ని కొనసాగిస్తా.. దేశానికి సేవ చేయాలనుకుంటున్నా!: క్రికెటర్ గౌతమ్ గంభీర్

  • తూర్పు ఢిల్లీ సీటు నుంచి గంభీర్ పోటీ
  • ఇటీవల బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్
  • కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలతో పోటీ
తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత, క్రికెటర్ గౌతం గంభీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నామినేషన్ దాఖలు చేసేందుకు గంభీర్ ఈరోజు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను నిజంగానే దేశానికి ఎంతోకొంత సేవ చేయాలని కోరుకుంటున్నా. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశానికి ఎంత సేవ అయితే చేశారో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మహేశ్ గిరి స్థానంలో బరిలోకి దిగిన గంభీర్ కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలను ఎదుర్కోనున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది.
Narendra Modi
Cricket
gautam
gambhir
east delhi

More Telugu News