Narendra Modi: దేశాన్ని నడుపుతున్నారా.. లేక పబ్ జీ గేమ్ ఆడుతున్నారా?: అమిత్ షాపై ఒవైసీ సెటైర్లు

  • పుల్వామాలో ఉగ్రదాడిపై అమిత్ షా కామెంట్
  • మోదీ తన వాయుసేనను పంపారని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో వెటకారంగా స్పందించిన ఒవైసీ
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జైషే మొహమ్మద్ ఉగ్రదాడి చేయడంతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసేందుకు ప్రధాని మోదీ తన వాయుసేనను పంపారని బీజేపీ చీఫ్ అమిత్ షా గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా స్పందించారు.

ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ.. ‘మోదీజీ సైన్యం.. మోదీజీ ఎయిర్ ఫోర్స్, మోదీజీ న్యూక్లియర్ బాంబు... ఇప్పటివరకూ ఏయే ఆస్తులు దేశానికి ఉన్నాయో అవన్నీ గత ఐదేళ్లలో మోదీవి అయిపోయాయి. దేశాన్ని నడుపుతున్నారా? లేక పబ్ జీ గేమ్ ఆడుతున్నారా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి పీఎంవో ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు.
Narendra Modi
BJP
Amit Shah
Asaduddin Owaisi
MIM
Twitter

More Telugu News