ఆత్మకూరు పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో మరోమారు కలకలం రేపిన వీవీప్యాట్ స్లిప్పులు..
- గతంలో ఇదే పాఠశాల ఆవరణలో లభించిన 200 స్లిప్పులు
- నోటా గుర్తుతో ఉన్న మరో నాలుగు స్లిప్పులు లభ్యం
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
తాజాగా, ఇదే పాఠశాలలో మరోమారు వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. పాఠశాల మరుగుదొడ్ల సమీపంలో నాలుగు స్లిప్పులు కనిపించాయి. వీటిపై నోటా గుర్తులున్నాయి. విషయాన్ని కొందరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారొచ్చి స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఉన్న వివరాల ఆధారంగా దేపూరు పోలింగ్ కేంద్రం అధికారులను పోలీసులు విచారించారు. ఇవి మాక్ పోలింగ్ స్లిప్పులని వారు వివరణ ఇచ్చినట్టు సమాచారం.