Andhra Pradesh: ప్రత్యర్థుల ప్రచారాన్ని పట్టించుకోవద్దు: టీడీపీ నాయకులతో చంద్రబాబు

  • టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కొనసాగుతున్న సమీక్ష  
  • ఓటమి తప్పదని ఈవీఎంల పని తీరును తప్పుబట్టామంటున్నారు
  • ప్రత్యర్థుల మాటలకు డీలా పడొద్దన్న బాబు
ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు అనేక కారణాలు వెతుక్కుంటున్నారంటూ ప్రత్యర్థుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని తమ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమీక్ష కొనసాగుతోంది. పోలింగ్ సరళిని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో ఆయన సమీక్షిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంల పనితీరుపై ఈసీకి తాను ఫిర్యాదు చేయడం,ఈ విషయమై తాను చేస్తున్న పోరాటం చూసి టీడీపీ ఓడిపోతుందని భావించి, అందుకే ఇలా చేస్తున్నానంటూ ప్రత్యర్థుల ప్రచారం గురించి పట్టించుకోవద్దని, డీలా పడొద్దని తమ నాయకులకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం.  
Andhra Pradesh
Telugudesam
YSRCP
janasena
bjp

More Telugu News