సల్మాన్ ఖాన్ ‘భారత్’ ట్రైలర్ విడుదల

షార్ట్స్‌లో చూడండి
ప్రతి ఏటా రంజాన్ కానుకగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిత్రం విడుదల అవుతూ ఉంటుంది. ఈ ఏడాది ‘భారత్’ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బేనర్ పై రూపొందిస్తున్న ‘భారత్’ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో అప్పుడే  నా కథ మొదలైంది’ అంటూ సల్మాన్ ఖాన్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

ఆకట్టుకునేలా ఉన్న ఈ  ట్రైలర్ లో సల్మాన్ యాక్టింగ్ అదిరింది. సల్మాన్- కత్రినా కైఫ్ సన్నివేశాలతో పాటు ఓ కార్మికుడిలా, నేవీ అధికారిగా, సర్కస్ ఫీట్స్ చేస్తూ సల్మాన్ కనబడతాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కాగా, ‘భారత్’లో అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, కృష్ణ కుమార్ తదితరులు నటిస్తున్నారు.
Go Back to Shorts
Bollywood
Salman Khan
BHARAT
Katrina Kaif

More Telugu News