Revanth Reddy: రేవంత్ రెడ్డి రాకతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత.. అరెస్ట్

  • విద్యార్థులకు సంఘీభావంగా రేవంత్ ధర్నా
  • అడ్డుకున్న పోలీసులు
  • ఇంటర్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలచివేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు చేపడుతుండగా, క్రమంగా రాజకీయ పక్షాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి.

అప్పటికే ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా రంగప్రవేశం చేశారు. ఇంటర్ బోర్డు వద్దకు ఆయన రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. రేవంత్ అండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఊగిపోయారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు కనిపించడంతో పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ ను కూడా అరెస్ట్ చేశారు.
Revanth Reddy
Telangana

More Telugu News