Bay Of Bengal: మండు వేసవిలో బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఈ నెల 26న ఏర్పడే అవకాశం
  • వాయుగుండంగా మారే చాన్స్!
  • తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా
భానుడి భగభగలతో అట్టుడికిపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు చల్లటి కబురు! ఈ నెల 26న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రానున్న రోజుల్లో వాయుగుండంగా మారి, దక్షిణ తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా. దీనికారణంగా తమిళనాడులో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే దీని కదలికలపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షం పడే అవకాశాలున్నాయి.

మరోవైపు, దేశంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది.
Bay Of Bengal
Tamilnadu
Andhra Pradesh

More Telugu News