Tamilnadu: దేవుడి హుండీలో చిల్లర కోసం తొక్కిసలాట... ఏడుగురు మృతి

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ముత్యంపాళ్యం కరుప్పుస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఏడుగురు మృతి చెందారు. ప్రతి ఏడాది కరుప్పుస్వామి ఆలయంలో చైత్రమాస ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు చిల్లర నాణేలు పంచడం ఆనవాయితీ. ఈ చిల్లర దగ్గర ఉంటే దైవానుగ్రహం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఎప్పట్లాగానే ఆనవాయితీ ప్రకారం హుండీలోని చిల్లర పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఏంజరుగుతుందో అర్థమయ్యే లోపు ఏడుగురు ప్రాణాలు వదిలారు. మరో పదిమంది గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి సమీపంలో ఈ ఆలయం ఉంది.
Go Back to Shorts
Tamilnadu

More Telugu News