ఛత్తీస్ గఢ్ అడవుల్లో గర్జించిన తుపాకులు.. ఇద్దరు మావోయిస్టుల కాల్చివేత!
- పామేడ్ అడవుల్లో మావోలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం
- గ్రేహౌండ్స్, ఛత్తీస్ గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
పామేడ్ అడవుల్లో బలగాల కదలికలను పసిగట్టిన మావోలు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు చనిపోగా, ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.