Action Hero: రాజకీయాల్లోకి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీడియోల్.. అమృత్‌సర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ?

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్ బీజేపీలో చేరబోతున్నట్టు, ఈ ఎన్నికల్లో ఆయన అమృత్‌సర్ నుంచి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీ చీఫ్ అమిత్‌షాతో సన్నీ డియోల్ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ మూడు స్థానాల్లో బరిలోకి దిగుతోంది. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో అమృత్‌సర్ ఒకటి కాగా, ఇక్కడి నుంచి ఎవరైనా ప్రముఖ వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది.

ఇందుకోసం టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్,  పూనం ధిల్లాన్‌, రాజేందర్‌ మోహన్‌ సింగ్‌ లాంటి ప్రముఖుల పేర్లను పరిశీలించారు. అయితే, చివరికి సన్నీడియోల్‌వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కాగా, తాను అమృత్‌సర్ నుంచి పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై సన్నీ స్పందించాడు. అమిత్‌షాను కలిసి ఫొటో తీసుకున్న విషయం వాస్తవమేనని, అయితే, అంతకుమించి మరేమీ లేదని తేల్చి చెప్పాడు.
Go Back to Shorts
Action Hero
Sunny Deol
BJP
Amritsar
Amit Shah

More Telugu News