Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

  • ఢిల్లీ నుంచి వారణాసి వైపు వెళ్తున్న బస్సు
  • అదుపుతప్పి లారీని ఢీకొన్న వైనం 
  • 34 మందికి తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి వారణాసివైపు వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం తుక్కుతుక్కు అయింది. డ్రైవర్ సహా ఏడుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh
Lucknow
Bus
Lorry
Road Accident

More Telugu News