Rajamouli: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో శ్రద్ధా కపూర్ కోసం స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జంటగా శ్రద్ధా కపూర్ ను తాజాగా ఎంచుకున్నారు. దాంతో స్క్రిప్టు విషయంలో స్వల్ప మార్పులు చేస్తున్నారట.
*  విజయ్ దేవరకొండ నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం విడుదల వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. మొదట్లో మే 31న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, అదే రోజున సూర్య నటించిన 'ఎన్జీకే' విడుదలవుతున్నందున ఈ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నారట. దీంతో జూలై 19న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.  
*  అఖిల్ అక్కినేని నటించే నాలుగో చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున లాంఛనంగా ప్రారంభం కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల రెండో వారం నుంచి జరుగుతుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది.  
Go Back to Shorts
Rajamouli
NTR
Charan
Shraddha Kapur

More Telugu News