Hyderabad: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కూలిన వృక్షం.. పలువురుకి గాయాలు!

  • ముంచెత్తుతున్న అకాల వర్షాలు 
  • ఇబ్బందులు పడుతున్న నగర వాసులు
  • మహిళ పరిస్థితి విషమం
అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పంట చేతికొచ్చే సమయానికి కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పడుతున్న వర్షానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయి నగరవాసులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నేటి సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నెహ్రూ జూలాజికల్ పార్కులోని భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో 10 నుంచి 15 మంది సందర్శకులు గాయాలపాలయ్యారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad
Rains
Nehru Zoological Park
Traffic
Tree

More Telugu News