CM Ramesh: సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బంధువర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం రమేశ్ అక్క కొడుకైన ధర్మారామ్ అమీర్ పేటలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ధర్మారామ్ కుటుంబం శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది.

ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్తాపం చెందిన ధర్మారామ్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ధర్మారామ్ మ్యాథ్స్ లో ఫెయిలైనట్టు సమాచారం. దాంతో, తండ్రి, సోదరికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలపాలైన ధర్మారామ్ ప్రాణాలు విడిచాడు. కింది అంతస్తులోనే ఉన్న సోదరి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అతడిని హుటాహుటీన యశోద ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
Go Back to Shorts
CM Ramesh

More Telugu News