Anchor Rashmi: ప్రస్తుతం జరుగుతున్న ప్రతీ ఘటనా మరింత భయానకంగా ఉంటోంది: యాంకర్ రష్మి

  • రోజుకో కొత్త కేసు నమోదవుతోంది
  • ప్రతీ ఘటనా మరింత భయానకంగా ఉంటోంది
  • ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది
బీహార్‌లోని భగల్‌పూర్‌లో ఓ టీనేజర్ తనపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు యువకులపై తిరగబడింది. దీంతో వారు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ యాంకర్ రష్మి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికి పారేయాలంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడింది.

‘రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటనా మరింత భయానకంగా ఉంటోంది. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికిపారేయాలి. లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి స్త్రీ జాతి విలువ తెలుస్తుంది’ అని ట్విట్టర్ ద్వారా రష్మి ఫైర్ అయింది.
Anchor Rashmi
Teenager
Bihar
Bhagalpur

More Telugu News