kanakamedala: దేశ రాజకీయాలలో చంద్రబాబు కీలకపాత్ర పోషించబోతున్నారు: కనకమేడల

  • దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది
  • టీడీపీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబోతున్నారు
  • జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తుంది
చంద్రబాబు గొప్ప నాయకుడని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆయన సేవలు ఏపీకే కాకుండా, యావత్ దేశానికి అవసరమని చెప్పారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించబోతున్నారని అన్నారు. సీఎం పనితీరును గుర్తించిన రాష్ట్ర ప్రజలు... ఈ ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీయేతర కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఈరోజు చంద్రబాబు పుట్టినరోజును కనకమేడల నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
kanakamedala
Chandrababu
Telugudesam
bjp

More Telugu News