raviteja: రవితేజ ద్విపాత్రాభినయం .. ఒక పాత్రకు డిజార్డర్

  • 'డిస్కోరాజా'గా కనిపించనున్న రవితేజ
  • తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం
  • రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు  
కొంతకాలంగా వరుస పరాజయాలతో రవితేజ సతమతమవుతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'డిస్కోరాజా' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన తెరపై కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకి విచిత్రమైన ఒక డిజార్డర్ వుంటుందట. కీలకమైన సమయాల్లో ఆ పాత్ర ఒక్కసారిగా బిగుసుకుపోతుందట. ఆ పాత్రకి గల ఆ డిజార్డర్ .. కథ ఎలాంటి మలుపులు తిరగడానికి కారణమవుతుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది చాలా ఆసక్తికరంగా వుంటుందట. రవితేజ సరసన నాయికలుగా పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు.
raviteja
payal
nabha
priyanka

More Telugu News