CEC: ఈసీ వైఖరి సరికాదు... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి

  • తాగు, సాగునీటి అంశాలపై వెసులుబాటివ్వాలి
  • అత్యవసర అంశాల్లో ఇది తప్పనిసరి
  • వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఎందుకు స్పందించడం లేదు
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్న ఎన్నికల సంఘం అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇవ్వకపోవడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి విమర్శించారు. కోడ్‌పై హడావుడి చేసే ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లు లెక్కించమంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఎంతో సమయం ఉందని, ఈలోగా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యతోపాటు రైతుల్ని ఆదుకునేందుకు ఈసీ చొరవ చూపాలని కోరారు.
CEC
government
Tulasireddy

More Telugu News