Andhra Pradesh: చంద్రబాబు విజన్ త్వరలోనే సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా!: నటుడు శివాజీ

  • సీఎం అంటే బాబులా ఉండాలని భావితరాలు అనుకోవాలి
  • అలాంటి పాలన అందజేస్తారని ఆశిస్తున్నా
  • టీడీపీ అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి అంటే చంద్రబాబులా ఉండాలని భావిభారతం అనుకునేలా టీడీపీ అధినేత పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు నటుడు శివాజీ తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శివాజీ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశం గర్వించేలా, యావత్ భరతజాతి ఏపీవైపు తిరిగిచూసేలా చంద్రబాబు విజన్ త్వరలో సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శివాజీ అన్నారు. ఇక ముందు కూడా చంద్రబాబు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని భావిస్తున్నానన్నారు. ‘ధ్యాంక్యూ సీఎం సార్. హ్యావ్ ఏ హ్యాపీ బర్త్ డే’ అని చెప్పారు. ఈ మేరకు శివాజీ ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
birthday
Facebook
sivaji]

More Telugu News