Ramgopal Varma: చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షల్లోనూ రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యం!

  • నేడు చంద్రబాబు పుట్టిన రోజు
  • భూమిపై ఉన్న అత్యంత నీతి, నిజాయితీ గల వ్యక్తి
  • సెటైర్ వేసిన వర్మ
నేడు చంద్రబాబునాయుడు తన 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా, ఎంతో మంది శుభాభినందనలను తెలియజేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన వ్యంగ్య శైలిలో అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూనే సెటైర్ వేశారు. "ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టూ చంద్రబాబునాయుడు. ఈ భూమిపై అత్యంత నీతి, నిజాయతీతో నివసిస్తున్న వ్యక్తి" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై మూడు నమస్కార ఎమోజీలను ఉంచారు. వర్మ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.



Ramgopal Varma
Chandrababu
Twitter
Birthday

More Telugu News