Andhra Pradesh: మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని!: నారా లోకేశ్

  • చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
  • ఓ విజనరీగా చంద్రబాబు ప్రపంచానికి తెలుసని వ్యాఖ్య
  • ఇప్పటికే శుభాకాంక్షలు చెప్పిన మోదీ, జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

నారా లోకేశ్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఓ విజనరీగా, ధైర్యవంతుడైన వ్యక్తి అయిన మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్ తో నాలుగేళ్ల పిల్లాడిలా పరిగెత్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తిమంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
birthday
Nara Lokesh
Twitter

More Telugu News