Chandrababu: చంద్రబాబునాయుడికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు!

  • నేడు చంద్రబాబు పుట్టిన రోజు
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పిన జగన్
  • వినూత్నంగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
నేడు చంద్రబాబు తన 69వ పుట్టిన రోజును జరుపుకుంటుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం 8.26కు జగన్ ట్వీట్ పెట్టగా, అది నిమిషాల్లో వైరల్ అయింది. నెటిజన్లు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు వినూత్నంగా రియాక్ట్ అవుతున్నారు. కాబోయే సీఎం, మాజీ కాబోతున్న సీఎంకు అభినందనలు చెప్పారని, శత్రువైనా దగ్గరకు తీసుకునే మనస్తత్వం జగన్ దని, జగన్ ది చాలా పెద్ద మనసు అని, చంద్రబాబు జగన్ నుంచి శుభాకాంక్షలు ఊహించి వుండరని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Chandrababu
Jagan
Birthday

More Telugu News