Election Commission: దేవెగౌడ లగేజీని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

  • ఇటీవల నవీన్ పట్నాయక్ లగేజీ తనిఖీ
  • కుమారస్వామి హెలికాఫ్టర్‌లోనూ తనిఖీలు
  • నేడు దేవెగౌడ లగేజీని తనిఖీ చేసిన ఈసీ
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్ తనిఖీలను ముమ్మరం చేసింది. కొద్ది రోజుల క్రితం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లగేజీని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు, అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాఫ్టర్‌లోనూ రెండు సార్లు సోదాలు జరిపారు. తాజాగా నేడు జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ లగేజీని ఈసీ తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవెగౌడ హెలికాఫ్టర్‌లో కొప్పళ్ నుంచి విజయపుర వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈసీ సోదాలు నిర్వహించింది.
Election Commission
Devegouda
Kumara Swamy
Naveen Patnayak
Vijayapura

More Telugu News