Amitabh Bachchan: పుల్వామా అమరులకు నివాళిగా బాలీవుడ్ నటుల పాట!

  • పాటను ఆలపించిన అమితాబ్, ఆమీర్, రణ్‌బీర్
  • ‘తూ దేశ్‌ మేరా’ అంటూ గానం
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఆర్పీఎఫ్
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవానుల కోసం బాలీవుడ్ సినీ ప్రముఖులు గొంతు సవరించారు. అమర వీరులకు నివాళిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ కలిసి ‘తూ దేశ్‌ మేరా’ అనే పాటను ఆలపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సీఆర్పీఎఫ్ వెల్లడించింది. ఆ ముగ్గురు ప్రముఖ నటులు పాటను ఆలపిస్తున్న సమయంలో తీసిన ఫోటోలను షేర్ చేసింది. ‘అమితాబ్‌, ఆమిర్‌, రణ్‌బీర్‌ అద్భుతమైన పని చేశారు. అమరవీరుల పట్ల మీరు చూపుతున్న మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సీఆర్పీఎఫ్ ట్వీట్‌లో పేర్కొంది.
Amitabh Bachchan
Amir Khan
Ranbeer Kapoor
CRPF
Pulvama

More Telugu News