Locket Chaterjee: నేను ప్రచారానికి వెళ్లిన సమయంలో నా ఇంటిని దోచేశారు: బెంగాల్ బీజేపీ అభ్యర్థి

  • నా ఇంటి చుట్టూ కొందరు తిరగడం గమనించా
  • గట్టిగా నిలదీయడంతో పారిపోయారు
  • ప్రచారానికి వెళ్లిన సమయంలో ఇంటిపై దాడి
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, సామగ్రి ధ్వంసం
బీజేపీ అభ్యర్థి ఇల్లు దోపిడీకి గురైంది. అయితే ఈ దోపిడీకి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులే పాల్పడ్డారని సదరు అభ్యర్థి ఆరోపిస్తున్నారు. కోల్‌కతాలోని హుగ్లీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బందేల్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడ మే 5న పోలింగ్ జరగనుంది. అయితే కొందరు వ్యక్తులు కొన్ని రోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతుండటాన్ని తాను గమనించానని, నిన్న వారిని గట్టిగా నిలదీయడంతో వారు పారిపోయారని తెలిపారు.

అయితే, నేటి ఉదయం తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని, ఈ దాడిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సామగ్రి ధ్వంసమయ్యాయని ఛటర్జీ తెలిపారు. ఇది టీఎంసీ పనేనని ఆమె ఆరోపించారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఎంసీపై నిందలు మోపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని టీఎంసీ హుగ్లీ జిల్లా నేత తపన్ దాస్ గుప్తా పేర్కొన్నారు. అసలు ఛటర్జీకి టికెట్ కేటాయించడం ఆ పార్టీలోని కొందరికి నచ్చలేదని, దీంతో తన ఇంటిపై దాడి జరిగిందని ఆమె చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఛటర్జీ తెలిపారు.
Locket Chaterjee
Electornic Device
TMC
BJP
Hugli
Loksabha
Thapan Das Guptha

More Telugu News