Rajinikanth: మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? అనే ప్రశ్నకు రజనీకాంత్ సమాధానం

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధం
  • మోదీ మళ్లీ పీఎం అవుతారా, లేదా అనేది మే 23న తెలుస్తుంది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధమని చెప్పారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రజనీకాంత్ తన పార్టీ పేరును కూడా ప్రకటించని సంగతి తెలిసిందే. మోదీ మరోసారి అధికారంలోకి వస్తారా? అంటూ మీడియా ప్రశ్నించగా... అది కూడా మే 23నే తెలుస్తుందని చెప్పారు.  మరోవైపు, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్న రజనీ ప్రకటనతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Rajinikanth
modi
bjp
kollywood

More Telugu News