Congress: కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గంటల్లోనే.. శివసేన పార్టీలో చేరుతున్న ప్రియాంకా చతుర్వేది!

  • తన వ్యతిరేకులను కాంగ్రెస్ చేర్చుకోవడంపై ఆగ్రహం
  • పార్టీకి గుడ్ బై చెప్పిన మహిళా నేత
  • ఉద్ధవ్ థాకరే సమక్షంలో నేడు శివసేన తీర్థం
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని మధురలో తన వ్యతిరేకులను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆగ్రహించిన ప్రియాంక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తన ట్విట్టర్ హ్యాండిల్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్న హోదాను సైతం తొలగించారు.

ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ప్రియాంకా చతుర్వేది తమ పార్టీలో చేరుతారని ప్రకటించారు. ఈరోజు పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఆమె శివసేన తీర్థం పుచ్చుకుంటారన్నారు. ప్రియాంక సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
Congress
sivasena
priyanka chaturwedi
join
Maharashtra

More Telugu News