Virat Kohli: ఎవరు ఎప్పుడు దిగాలో తరువాత తేలుస్తాం: కోహ్లీ

  • 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ   
  • తుది 11 మందినీ మ్యాచ్ కు ముందే నిర్ణయిస్తాం
  • నాలుగో స్థానానికి పోటీ అధికమన్న కోహ్లీ
త్వరలో జరిగే వరల్డ్ కప్ పోటీలకు 15 మందితో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించగా, తుది 11 మందిలో ఎవరుంటారు? ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న విషయాలను తరువాత నిర్ణయిస్తామని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. జట్టులో ఓపెనర్ల తరువాత విరాట్ కోహ్లీ ఖాయం. ఆపై ఐదో స్థానంలో వచ్చేందుకు ధోనీ ఎలాగూ ఉంటాడు. నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్న విషయమై ఇప్పటికీ ఇంకా సందిగ్ధత తొలగలేదు.

తాజాగా దీనిపై మాట్లాడిన కోహ్లీ, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, విజయ్ ల వంటి ఆటగాళ్లు ఉన్నారని, ఎవరు ఏ స్థానంలో ఆడాలన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయిస్తామని అన్నారు. నాలుగో స్థానానికి పోటీ అధికంగా ఉందని చెప్పాడు. తుది 11 మంది ఎవరన్న విషయాన్ని మ్యాచ్ కి ముందు మాత్రమే, పిచ్ పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని చెప్పాడు. విజయ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సామర్థ్యాలు పుష్కలమని అన్నాడు.
Virat Kohli
World Cup Cricket
4th Place

More Telugu News