Urmila Matondkar: మోదీ జీవిత చరిత్రపై సినిమానా?.. అదో జోక్!: విరుచుకుపడిన నటి ఊర్మిళ

  • హామీల అమలులో మోదీ ఘోరంగా విఫలమయ్యారు
  • ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు
  • 56 అంగుళాల ఛాతీ కలిగిన మోదీ దేశానికి చేసిందేమీ లేదు
ప్రధాని నరేంద్రమోదీపై బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్మిళ మతోండ్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఊర్మిళ.. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌ను జోక్‌గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మోదీ బయోపిక్ అంటే జోక్ తప్ప మరేమీ కాదన్నారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మోదీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీపై ఓ కామెడీ సినిమా తీస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కాగా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా ఈనెల 11నే విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయింది. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం కంటే దారుణం ఇంకేముంటుందని ఊర్మిళ ప్రశ్నించారు.
Urmila Matondkar
mumbai
BJP
Congress
Narendra Modi
biopic

More Telugu News