KA Paul: మరో గతిలేక జగన్ ఏవేవో మాట్లాడాడు, కానీ ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది: కేఏ పాల్

  • నేను చంద్రబాబు మనిషిని కాను
  • జగన్ క్రిమినల్ మనస్తత్వం
  • పవన్ కల్యాణ్ ఓ యాక్టర్
ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ మత ప్రచారకుడు కేఏ పాల్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ సందర్భంగా, 'చంద్రబాబుపై మీకు ప్రేమ ఎందుకు? జగన్ పై కోపం ఎందుకు?' అని యాంకర్ ప్రశ్నించగా, జగన్ ది క్రిమినల్ మనస్తత్వం అని, ఆయన తనకు నచ్చనివాళ్లను ఎలిమినేట్ చేయాలని ప్రయత్నిస్తుంటాడని ఆరోపించారు.

తనకు మాత్రం జగన్ అంటే భయంలేదని, తనను ఎలిమినేట్ చేయడం ఎవరివల్లా కాదని చెప్పారు. తనను ఎవరైనా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నిస్తే, దైవశక్తి వాళ్లను అడ్డుకుంటుందని, తనకంటే ముందు వాళ్లే ఎలిమినేట్ అయిపోతారని కేఏ పాల్ వివరించారు. ఇక, కేఏ పాల్ చంద్రబాబునాయుడు వ్యక్తి అని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు కదా? అని యాంకర్ ప్రశ్నించగా, అందులో వాస్తవం లేదని తెలిపారు.

జగన్ కు గతిలేక ఏవేవో మాట్లాడాడని, కానీ ఆయన చెప్పినదాంట్లో కొంత వాస్తవం ఉందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య అవగాహన ఉందని జగన్ అన్నారని, అది నిజమేనని తెలిపారు.

"అయితే, నన్ను ఎవరూ కొనలేరు, పవన్ కల్యాణ్ కు ఐదు, పది కోట్లు ఇస్తే మీ సినిమాలో అయినా యాక్ట్ చేస్తాడు" అంటూ పాల్ వ్యాఖ్యానించారు. 'పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీతో కలిసేవాడు. పవన్ ఎలాంటివాడో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు. కానీ పవన్ ఓ ఫ్రెష్ క్యాండిడేట్. మాతో కలిసుంటే అతడిలో మార్పు తీసుకువచ్చేవాడ్ని' అంటూ చెప్పారు. 
KA Paul
Pawan Kalyan
Jagan
Chandrababu

More Telugu News