Hyderabad: ముసాద్దీలాల్ జ్యువెలర్స్ లో ఈడీ సోదాలు..145 కిలోల బంగారం స్వాధీనం!

  • కైలాశ్ గుప్తాతో పాటు నలుగురి నివాసాల్లో సోదాలు
  • స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.82 కోట్లు 
  • నోట్ల రద్దు సమయంలో అక్రమ లావాదేవీలు 
హైదరాబాద్ లోని ముసాద్దీలాల్ జ్యువెలర్స్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. జ్యూవెలర్స్ యజమాని కైలాశ్ గుప్తాతో పాటు మరో నలుగురి నివాసాల్లోనూ సోదాలు జరిగినట్టు సమాచారం. రూ.82 కోట్ల విలువ చేసే145 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో రూ.110 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
Hyderabad
mussaddilal
jewellers
ED
gold

More Telugu News