assam: కుటుంబ సభ్యుల ఓట్లన్నీ తనే వేసేసిన వ్యక్తి!

  • కరీమ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గంలో రిగ్గింగ్
  • తన ఓటుతో పాటు కుటుంబసభ్యుల ఓట్లూ వేసేశాడు
  • నిజమేనన్న పోలింగ్ బూత్ అధికారి
అసోంలోని ఓ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగింది. ఒకే వ్యక్తి తన కుటుంబ సభ్యులందరి ఓట్లు వేసేశాడు. ఈ సంఘటన కరీమ్ గంజ్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగింది. సదరు వ్యక్తి పదిహేను సార్లు ఓటు వేసిన విషయం వాస్తవమేనని పోలింగ్ బూత్ అధికారి కూడా అంగీకరించడం గమనార్హం.

ఇదే నియోజకవర్గానికి చెందిన 116 సంవత్సరాల మహమూద్ అలీ, 104 సంవత్సరాల సరాగుణ బీబు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, అసోంలో రెండో దశ పోలింగ్ లో భాగంగా 5 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
assam
karimganj
loksabha

More Telugu News