Andhra Pradesh: మోదీ ప్రజాకర్షణను చూసి ఓర్వలేకే జీవీఎల్ పై చెప్పుతో దాడిచేయించారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • జీవీఎల్ పై దాడిని ఖండించిన కన్నా
  • బీజేపీ అభివృద్ధి విధానాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శ
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్
బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఈరోజు ఢిల్లీలో శక్తి భార్గవ అనే వ్యక్తి చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ చెప్పు దాడి నుంచి త్రుటిలో జీవీఎల్ తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జీవీఎల్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. ఇలాంటి దాడులు బీజేపీ నేతల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేవని స్పష్టం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ @GVLNRAO గారిపై ఆగంతకుడి దాడిని ఖండిస్తున్నాను. ఇది బీజేపీ అభివృద్ధి విధానాలను, మోదీ గారి ప్రజాకర్షణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రేరేపిత చర్య. ఇలాంటి చర్యలు బీజేపీ నేతల స్థైర్యాన్ని తగ్గించలేవు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
kanna
Narendra Modi
BJP
gvl
shoe attack
Twitter

More Telugu News