RGV: కేసీఆర్ పై రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. టైటిల్ ప్రకటించిన దర్శకుడు!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ అన్నట్లుగానే బయోపిక్ టైటిల్ ను ఈరోజు ప్రకటించారు. ‘టైగర్ కేసీఆర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో తెలిపారు.

ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జతచేశారు. కాగా, ఈ సినిమాలో నటీనటుల విషయమై త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ జీవితం, తెలంగాణ ఉద్యమంపై ‘ఉద్యమ సింహం’ అనే సినిమా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
RGV
KCR
Talking Movies
movies
Tollywood
Twitter

More Telugu News