Andhra Pradesh: ఇద్దరు తెలుగు సంతతి ప్రజలు కెనడాలో గెలుపొందడం గర్వంగా ఉంది!: ఏపీ సీఎం చంద్రబాబు

  • అల్బెర్టా అసెంబ్లీకి ఎన్నికైన ప్రసాద్, లీల
  • హర్షం వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
  • అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత
కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీకి ఇద్దరు తెలుగు మూలాలున్న వ్యక్తులు ఎన్నిక కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘కెనడా అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంతతికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికై రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఎన్నికల్లో విజయం అందుకున్న గుంటూరుకి చెందిన ప్రసాద్ పాండా, విజయనగరానికి చెందిన లీల అహీర్‌లకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
CANADA
ALBERTA
two telugu people
elected

More Telugu News