మొత్తానికి రకుల్ మరో ఛాన్స్ కొట్టేసింది
- నితిన్ చేతిలో మూడు సినిమాలు
- 'భీష్మ'లో నాయికగా రష్మిక మందన
- చంద్రశేఖర్ యేలేటి సినిమాలో రకుల్
ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమై వున్నాయి. ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాను కూడా నితిన్ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కృష్ణ చైతన్య ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.