Kathi Mahesh: 'గీత గోవిందం' దర్శకుడితో మహేశ్ బాబు?

  • 'గీతగోవిందం'తో దర్శకుడిగా పరశురామ్ కి క్రేజ్
  •  మళ్లీ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ 
  • మహేశ్ బాబు కోసం స్క్రిప్ట్ పై కసరత్తు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'గీత గోవిందం' సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఆయన మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ తో గానీ .. శిరీష్ తో గాని ఆయన సినిమా ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆయన సినిమా మహేశ్ బాబుతో ఉండనుందనేది తాజా సమాచారం.

ఈ మధ్య అల్లు అరవింద్ .. మహేశ్ బాబు ఇంటికి వెళ్లి ఆయన శ్రీమతి నమ్రతతో మాట్లాడి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. పరశురామ్ దగ్గర మహేశ్ బాబుకి సెట్ అయ్యే మంచి కథ ఉందనీ .. మహేశ్ బాబు డేట్స్ ఉంటే తాను నిర్మిస్తానని ఆమెతో చెప్పాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడం వలన డేట్స్ తప్పకుండా ఇస్తామనీ, అయితే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి వినిపించమని నమ్రత అన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
Kathi Mahesh
parashuram

More Telugu News