JC Diwakar Reddy: చంద్రబాబులో 'కమ్మ'దనం ఉంది... కానీ కాస్త మంచోడే: జేసీ దివాకర్ రెడ్డి

  • అనంతపురానికి నీళ్లివ్వకుంటే పార్టీని వీడేవాడిని
  • ఎన్నికల్లో నా డబ్బు నేనే ఖర్చు పెట్టా
  • చంద్రబాబు ఒక్క పైసా ఇవ్వలేదన్న జేసీ
"మీరెన్నైనా చెప్పండి... కమ్మోడు... కమ్మ నా... కొడుకు ఇవన్నీ ఉన్నాయి. నీళ్ల విషయంలో ఆయనకు కమ్మ లేదు కాపు లేదు. కష్టపడి పని చేస్తాడు. వాడు గనుక నీళ్లు తేకుంటే నేను ఎన్నడో గుడ్ బై చెప్పేసేవాడిని. పోయిన ఎలక్షన్స్ లో ఒక్క పైసా ఇవ్వలా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఆ నా... ఒక్కపైసా ఇవ్వలా. నేనే... చెబితే ఎవరూ నమ్మరు. నేనే ఖర్చు పెట్టా. ఇంతకుముందు పెట్టా. ఇప్పుడూ పెట్టా" అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన ఆయన, చంద్రబాబులో కమ్మ కులపు వారిపై కొంత ప్రేమ ఉన్నా, అందరినీ సమానంగా చూసే వ్యక్తేనని, కాస్తంత మంచితనం కూడా ఉందని అన్నారు. చంద్రబాబు వైఖరి సరైనదేనని, అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.
JC Diwakar Reddy
Chandrababu
Kamma
Kapu

More Telugu News