CBI EX JD: ఇవన్నీ అర్థరహిత ఆరోపణలు.. ఐఏఎస్ శ్రీలక్ష్మిని కొట్టారన్న ఆరోపణలపై లక్ష్మీనారాయణ!

  • గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన లక్ష్మీనారాయణ
  • శ్రీలక్ష్మిపై చేయి చేసుకున్నారన్న బీజేపీ నేత రఘురామ్
  • నిరాధార ఆరోపణలపై స్పందించబోనన్న సీబీఐ మాజీ జేడీ
జగన్ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సమయంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై తాను చేయి చేసుకున్నట్టు బీజేపీ నేత రఘురామ్ చేసిన ఆరోపణలపై సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన నేత, విశాఖ నుంచి లోక్ సభ బరిలో నిలబడిన లక్ష్మీనారాయణ స్పందించారు.

ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ కు గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి అవకతవకలకు పాల్పడినట్టు అభియోగాలు రాగా, అప్పట్లో కేసును లక్ష్మీ నారాయణ విచారించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అర్థరహిత ఆరోపణలని ఖండించారు. ఆధారాలు లేని ఈ ఆరోపణలపై తాను జవాబు చెప్పాల్సిన అవసరం లేదని అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన తేల్చి చెప్పారు. రఘురామ్ చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు.
CBI EX JD
Lakshminarayana
Sri Lakshmi

More Telugu News